టబుతో 28 ఏళ్ల తర్వాత రొమాన్స్ చేయనున్న వెంకీ?

by సూర్య | Tue, Jun 11, 2019, 04:48 PM

అందాల సీనియర్ నటి టబు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. హిందీలో విడుదలైన 'దే దే ప్యార్ దే' చిత్రం అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది. అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, టబూ కీలక పాత్రలుగా ఈ సినిమా తెరకెక్కింది. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను సురేశ్ ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నారు. ఇందులో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా ఈ సినిమాను నిర్మించనున్నారు. హిందీలో టబు చేసిన పాత్ర కోసం తెలుగులోను ఆమెనే తీసుకున్నారని తెలుస్తోంది.28 ఏళ్ల క్రితం 'కూలీ నెం 1' సినిమాలో వెంకీతో జోడీ కట్టిన టాబు, మళ్లీ ఇంతకాలానికి వెంకీ సరసన నటించబోతోంది. మరి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుందా అనేది తెలియాల్సి వుంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM