'క' సెట్స్ నుండి కిరణ్ అబ్బవరం BTS పిక్ రిలీజ్

by సూర్య | Wed, Sep 25, 2024, 03:50 PM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే పీరియాడికల్ థ్రిల్లర్ 'క' అనే చిత్రాన్ని ప్రకటించారు. ఆసక్తికరమైన టైటిల్ మరియు టీజర్ ప్రాజెక్ట్ చుట్టూ మంచి బజ్ క్రియేట్ చేసాయి. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో నటి సత్యభామ అనే పాత్రలో కనిపించనుంది. యువ దర్శకులు సుజీత్ మరియు సందీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించబడింది. మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసినట్లు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా సెట్స్ నుండి కిరణ్ యొక్క యాక్షన్ మోడ్ లో ఉన్న BTS పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఎడిటర్ శ్రీ వరప్రసాద్, సినిమాటోగ్రాఫర్లు విశ్వాస్ డేనియల్ మరియు సతీష్ రెడ్డితో సహా సాంకేతిక బృందంతో “క” థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సినిమా తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపతి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో తన్వి రామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించగా, శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పిస్తున్నారు.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'సత్యం సుందరం' బుకింగ్స్ Thu, Sep 26, 2024, 07:51 PM
‘దేవర’ ఆ హాలీవుడ్‌ సినిమాల్లా ఉంటుంది: అనిరుధ్‌ Thu, Sep 26, 2024, 07:50 PM
ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మట్కా' టీమ్ Thu, Sep 26, 2024, 07:46 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ 'భలే ఉన్నాడే' Thu, Sep 26, 2024, 07:41 PM
'వెట్టయన్' లో శ్వేతగా అభిరామి Thu, Sep 26, 2024, 07:39 PM