'వెట్టయన్' లో శ్వేతగా అభిరామి

by సూర్య | Thu, Sep 26, 2024, 07:39 PM

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని జై భీమ్ ఫేమ్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'వేట్టయాన్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ యాక్షన్ డ్రామాలో లెజెండరీ నటుడు పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్‌ని సృష్టించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అభిరామి యొక్క గ్లింప్సె ని విడుదల చేసారు. ఈ చిత్రంలో నటి శ్వేత అనే పాత్రలో నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. సాంకేతిక సిబ్బందిలో సినిమాటోగ్రాఫర్ SR కతిర్ I.S.C మరియు ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ ఉన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సూపర్ కాప్ థ్రిల్లర్ తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, జిఎం సుందర్, రోహిణి, రావు రమేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన సుభాస్కరన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాని సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 10, 2024న థియేటర్లలోకి రానుంది.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'సత్యం సుందరం' బుకింగ్స్ Thu, Sep 26, 2024, 07:51 PM
‘దేవర’ ఆ హాలీవుడ్‌ సినిమాల్లా ఉంటుంది: అనిరుధ్‌ Thu, Sep 26, 2024, 07:50 PM
ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మట్కా' టీమ్ Thu, Sep 26, 2024, 07:46 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ 'భలే ఉన్నాడే' Thu, Sep 26, 2024, 07:41 PM
'వెట్టయన్' లో శ్వేతగా అభిరామి Thu, Sep 26, 2024, 07:39 PM