ఎమ్మీ అవార్డ్స్ బరిలో 'ది నైట్‌ మేనేజర్‌'

by సూర్య | Fri, Sep 20, 2024, 02:27 PM

బాలీవుడ్‌ ప్రముఖ హీరో అనిల్‌ కపూర్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌ , శోభిత ధూళిపాళ్ల నటించిన వెబ్‌ సిరీస్‌ 'ది నైట్‌ మేనేజర్‌'.మంచి విజయాన్ని అందుకున్న ఈ సిరీస్‌ ఇప్పుడు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్‌ అవార్డుల బరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సిరీస్‌లతో పోటీ పడనుంది. 52వ ఎమ్మీ అవార్డుల నామినేషన్స్‌ను తాజాగా ప్రకటించారు. అందులో భారత్‌ నుంచి 'ది నైట్‌ మేనేజర్' మాత్రమే పోటీలో నిలవడం విశేషం. డ్రామా సిరీస్ విభాగంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్‌కు చెందిన సిరీస్‌లతో శోభితా  సిరీస్‌ పోటీపడనుంది. నవంబర్‌ 25న న్యూయార్క్‌లో ఎమ్మీ అవార్డుల వేడుక జరగనుంది.


'ది నైట్‌ మేనేజర్' ఎమ్మీ అవార్డుల్లో నామినేషన్‌ దక్కించుకోవడంపై అనిల్‌ కపూర్‌, దర్శకుడు సందీప్‌ మోదీ స్పందించారు. 'నేను నమ్మలేకపోతున్నా. టీమ్‌లోని వారందరికీ మెసేజ్‌లు పెట్టా. మేమంతా ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూనే ఉన్నాం' అని అనిల్‌కపూర్‌ సంతోషం వ్యక్తంచేశారు. ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయని దర్శకుడు తన ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఈ సిరీస్‌ కోసం వర్క్‌ చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. థ్యాంక్యూ గాడ్‌ అని రాసుకొచ్చారు.2016లో వచ్చిన ఆంగ్ల సిరీస్‌ 'ది నైట్‌ మేనేజర్‌'ను అదే పేరుతో ఓటీటీ సంస్థ 'డిస్నీ+ హాట్‌స్టార్‌' హిందీ, తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీలో రీమేక్‌ చేసి ప్రసారం చేసింది. ఈ సిరీస్‌ ప్రేక్షకాదరణను సొంతం చేసుకోవడంతో దీని రెండో సీజన్‌ను తెరకెక్కించారు. అదీ మంచి విజయాన్ని అందుకుంది.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM