‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ షోలో పవన్‌ కల్యాణ్‌

by సూర్య | Mon, Sep 16, 2024, 08:39 PM

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోగానే కాకుండా ఇప్పుడు జనసేన అధినేతగా రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. తన పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాల్లో విజయం సాధించారు. దీంతో పవన్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. తాజాగా అమితాబ్‌  బచ్చన్‌  హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’  షోలో  పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన ప్రశ్న అడగడం ప్రత్యేకత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ షో 16వ సీజన్‌ నడుస్తోంది.  తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను పవన్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు. ‘2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు?’ అని అడిగారు. కంటెస్టెంట్‌ ఈ ప్రశ్నకు ‘ఆడియన్స్‌ పోల్‌’ ఆప్షన్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడియన్స్‌లో 50 శాతం మందికి పైగా పవన్‌ కల్యాణ్‌ అని జవాబు చెప్పారు. దీంతో వారు పవన్‌ పేరు చెప్పి లాక్‌ చేశారు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్‌ రూ.1.60 లక్షలు గెలుచుకున్నారు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండడంతో సినిమాల షూటింగ్‌కు కాస్త గ్యాప్‌ వచ్చింది.  ఆయన  ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే!  త్వరలోనే ఆయన కాలీట్లు ఇచ్చి షూటింగ్‌లో పాల్గొంటానని మాటిచ్చినట్లు ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజున వెల్లడించారు.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM