విఘ్నేష్ హీరోగా ‘రెడ్‌ఫ్లవర్’

by సూర్య | Mon, Sep 16, 2024, 08:31 PM

నటుడు విఘ్నేష్ హీరోగా ఆండ్రూ పాండియన్  దర్శకత్వంలో శ్రీ కాళికాంబాల్‌ పిక్చర్స్ సమర్పణలో నిర్మాత కె.మాణిక్యం నిర్మిస్తున్న ‘రెడ్‌ఫ్లవర్’  చిత్రం బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కంపోజింగ్‌ కోసం హంగేరియన్‌ ఆర్కెస్ట్రా పనిచేస్తుంది. సంతోష్‌ రామ్ సంగీతం అందిస్తున్నారు. అయితే, నేపథ్య సంగీతం బలంగా ఉండాలని భావించిన దర్శక నిర్మాతలు ఇందుకోసం హంగేరియన్‌ ఆర్కెస్ట్రా సాయం తీసుకున్నారు. వైవిధ్యభరితమైన యాక్షన్‌ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేసుకోగా, నేపథ్య సంగీతం, వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ విషయంపై సంగీత దర్శకుడు సంతోష్‌ రామ్‌ మాట్లాడుతూ, ‘ఇది నేను చేసే తొలి ప్రాజెక్టు. నా ప్రతిభను నిరూపించుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాను. ‘రెడ్‌ఫ్లవర్‌’ అనేది ఫ్యూచరిస్టిక్‌ మూవీ. అందుకే సైన్స్‌ ఫిక్షన్‌కి సరిపోయే ఆధునిక, వినూత్నమైన ఆర్కెస్ట్రా స్కోర్‌ అందించేందుకు హంగేరియన్‌ సంగీత బృందంతో కలిసి పనిచేస్తున్నాను’ అని తెలిపారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM