ఈ నెల 20న విడుదల కానున్న‌ ‘చ‌ట్టంఎంకైయిల్’

by సూర్య | Mon, Sep 16, 2024, 08:29 PM

త‌మిళ‌నాట మ‌రో క‌మెడియ‌న్ సీరియ‌స్ సినిమాల బాట ప‌ట్టాడు. ఇప్ప‌టికే యోగిబాబు ప్ర‌ధాన‌ పాత్ర‌లో కామెడీ సినిమాల నుంచి మంచి ఫ్యామిలీ స్టోరీ చిత్రాలు తెర‌కెక్కుతుండ‌గా ఆ త‌ర్వాత మ‌రో క‌మెడియ‌న్ సూరి కూడా హీరోగా మారి ఇటీవ‌ల విడుద‌ల పార్ట్‌1, గ‌రుడ‌న్‌, కొట్టుకాళి వంటి హెవీ సీరియ‌స్ స‌బ్జెక్ట్స్‌తో అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వీరి బాట‌లోనే మ‌రో ప్ర‌ముఖ హాస్య న‌టుడు స‌తీష్ అడుగులు వేస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు. స‌తీష్ ఈమ‌ధ్య కామెడీ హీరోగా చేసిన కంజూరింగ్ క‌న్న‌ప్ప మంచి విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో ఆయ‌న ఇప్పుడు త‌న పంథాను మార్చి హెవీ సీరియ‌స్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘చ‌ట్టంఎంకైయిల్’ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ‘సిక్సర్‌’ ఫేం చాచీ  ఈ సినిమాకు దర్శకుడు. ఈ నెల 20న విడుదల కానున్న‌ ఈ చిత్ర టీజర్‌ను తాజాగా ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి, దర్శకుడు వెంకట్‌ ప్రభు తమ ట్విట్టర్‌ హ్యాండిల్స్‌లో విడుదల చేయ‌గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సంపత్‌, అజయ్‌రాజ్, పావెల్‌ నవగీతన్‌, విద్యాప్రదీప్, మైమ్‌గోపి, రిత్విక, తమిళ్‌ సెల్వి, గజరాజ్‌ నటించారు. టీజ‌ర్‌ను గ‌మనిస్తే.. ‘ఈ సినిమా మిస్టరీ హ‌త్య‌ల‌ నేప‌థ్యంలో సాగ‌నుంది. హత్యలు చేస్తున్న‌దెవ‌రో తెలుసుకోవ‌డానికి పోలీసులు తీవ్రంగా ప‌రిశోధించ‌డం, అదే స‌మ‌యంలో హీరో సతీష్‌ పోలీసు జీపులోంచి దిగ‌డం, అతని మొహంలో ఒక విధమైన భయం, వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డం, అక్క‌డి కార్ల‌పై దాడి చేయ‌డం, పోలీసులు హీరోను కొట్ట‌డం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆసక్తికర సన్నివేశాలతో టీజ‌ర్ ఇట్టే ఆక‌ట్టుకుంటోంది.. ఈ మిస్టరీ హత్యల వెనుక ఎవరున్నారు, ఎందుకు చేశార‌నే స్టోరీతో సస్పెన్స్‌ క్రైం థ్రిల్లర్‌ జోనర్‌లో ఈ మూవీని తెరకెక్కించారు’. షణ్ముగం క్రియేషన్స్‌ బ్యానరుపై నిర్మించిన‌ ఈ చిత్రానికి ఎంఎస్‌ జోన్స్‌ రూబెర్ట్ సంగీతం అందించారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM