నందన్ చిత్రం ఆడియో రిలీజ్

by సూర్య | Mon, Sep 16, 2024, 08:32 PM

‘నందన్‌’ వంటి చిత్రాన్ని నిర్మించాలంటే ఎంతో ధైర్యం కావాలని ప్రముఖ దర్శకుడు, నామ్‌ తమిళర్‌ కట్చి కన్వీనర్‌ సీమాన్ అన్నారు. ఎరా శరవణన్  దర్శకత్వం వహించిన నందన్  చిత్రం ఆడియో రిలీజ్ ఇటీవ‌ల చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీమాన్  ప్రసంగిస్తూ, ‘నా బిజీ షెడ్యూల్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా కథ నన్ను ఈ ఆడియో వేడుకకు వచ్చేలా ప్రేరేపించింది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. ఇది చాలా ముఖ్యమైన చిత్రం. ఇలాంటి చిత్రాన్ని రూపొందించడానికి ఎంతో ధైర్యం కావాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని కోరారు. హీరో శశికుమార్ మాట్లాడుతూ, ‘తొలుత ఈ చిత్రాన్ని నేనే స్వయంగా నిర్మించాలని భావించాను. ఆ తర్వాత అతిథి పాత్రలో నటించాలని అనుకున్నాను. చివరకు ఈ చిత్రంలో పూర్తిస్థాయిలో నటించాలని నిర్ణయించుకుని హీరోగా చేశాను. ఈ స్క్రిప్టు నిజంగా గొప్ప కథ. సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నాం. ఈ సినిమా ఔట్‌పుట్‌ కూడా ఆసక్తికరంగా వచ్చింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అన్నారు. శృతి పెరియస్వామి, మాధేష్‌, మిథున్‌, బాలాజీ శక్తివేల్‌, కొట్ట ఎరుంబు స్టాలిన్‌, సముద్రఖని, వి.ఙ్ఞానవేల్‌, జీఎం కుమార్‌ తదితరులు నటించగా, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకం, ఎరా ఎంటర్‌టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM