by సూర్య | Fri, Jul 12, 2024, 01:30 PM
గేమ్ ఛేంజర్ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ఉప్పెనతో జాతీయ అవార్డును గెలుచుకున్న బుచ్చిబాబు సనతో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాతో వెంకట సతీష్ కిలారు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు. RC16 అని తాత్కాలికంగా పేరు పెట్టబడిన ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ పుట్టినరోజు శుభాకంక్షాలు తెలియజేస్తూ మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు.
Latest News