6M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'తంగలన్' ట్రైలర్

by సూర్య | Thu, Jul 11, 2024, 05:28 PM

దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో  విక్రమ్ తంగలన్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాపై ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. తాజగా ఇప్పుడు ఈ సినిమా యొక్క అన్ని వెర్షన్స్ ట్రైలర్ 6 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది.

Latest News
 
నవంబర్‌ 1న ఓటీటీలోకి 'విశ్వం' ? Wed, Oct 30, 2024, 12:30 PM
మా అమ్మ కూలి పని చేసి మమ్మల్ని చదివించింది: కిరణ్‌ అబ్బవరం Wed, Oct 30, 2024, 12:11 PM
కంగువా మూవీ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ మృతి..! Wed, Oct 30, 2024, 11:59 AM
అయోధ్యలో వానరాల కోసం నటుడు అక్షయ్ కుమార్ రూ.కోటి విరాళం Wed, Oct 30, 2024, 11:13 AM
బ్లాక్ చీరలో గ్లామరస్‌గా సాక్షి మాలిక్ Tue, Oct 29, 2024, 08:54 PM