వెంకటేష్-అనిల్ రావిపూడి చిత్రంలో యానిమల్ నటుడు

by సూర్య | Thu, Jul 11, 2024, 09:17 PM

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు అనిల్ రావిపూడి కలిసి వెంకీఅనిల్ 3 అనే క్రైమ్ ఎంటర్‌టైనర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబడింది. ఈరోజు ఈ సినిమా షూటింగ్ ని హైదరాబాద్‌లో ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో జాతీయ అవార్డు గెలుచుకున్న మరాఠీ నటుడు ఉపేంద్ర లిమాయే కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

Latest News
 
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Wed, Oct 30, 2024, 02:49 PM
ప్రొడ్యూస్ వంశి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'క' టీమ్ Wed, Oct 30, 2024, 02:44 PM
'లక్కీ బాస్కర్' ప్రీమియర్స్ కి భారీ రెస్పాన్స్ Wed, Oct 30, 2024, 02:40 PM
నాల్గవ తరం ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్ ని ప్రకటించిన వైవీఎస్ చౌదరి Wed, Oct 30, 2024, 02:35 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మట్కా' సెకండ్ సింగల్ Wed, Oct 30, 2024, 02:26 PM