స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'ఊరు పేరు భైరవకోన' హిందీ వెర్షన్

by సూర్య | Tue, Jul 09, 2024, 03:40 PM

వీఐ ఆనంద్ దర్శకత్వంలో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్ నటించిన 'ఊరి పేరు భైరవకోన' సినిమా ఫిబ్రవరి 16, 2024న విడుదల అయ్యింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ ఫాంటసీ రొమాంటిక్ థ్రిల్లర్ ఇప్పుడు హిందీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది అని సమాచారం. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తుంది. కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్, రవిశంకర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రతిష్టాత్మకంగా సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

Latest News
 
ఓటీటీలోకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sun, Jul 14, 2024, 02:11 PM
అందుకే లిప్స్ ఇలా మారాయి.. శ్రీసత్య Sun, Jul 14, 2024, 12:01 PM
ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు Sun, Jul 14, 2024, 11:22 AM
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM