'స్పిరిట్' లో కొరియన్ నటుడు?

by సూర్య | Tue, Jul 09, 2024, 03:37 PM

టాలీవుడ్ నటుడు ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి తన అత్యంత ప్రతిష్టాత్మకమైన సిల్వర్ జూబ్లీ చిత్రంకోసం జతకట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'స్పిరిట్' అనే టైటిల్ ని లాక్ చేసారు. స్పిరిట్‌లో ప్రభాస్ పోలీసుగా నటించనున్నాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలో దక్షిణ కొరియా నటుడు మా డాంగ్-సియోక్ విలన్ గా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మా డాంగ్-సియోక్ జోంబీ చిత్రం ట్రైన్ టు బుసాన్‌తో ఖ్యాతిని పొందారు. అతను తరువాత MCU యొక్క ఎటర్నల్స్, ది అవుట్‌లాస్, అన్‌స్టాపబుల్, ది బ్యాడ్ గైస్: రీన్ ఆఫ్ ఖోస్, మరియు ది గ్యాంగ్‌స్టర్, ది కాప్, ది డెవిల్ వంటి ప్రముఖ చిత్రాలలో నటించాడు. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ భూషణ్ కుమార్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

Latest News
 
ఓటీటీలోకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sun, Jul 14, 2024, 02:11 PM
అందుకే లిప్స్ ఇలా మారాయి.. శ్రీసత్య Sun, Jul 14, 2024, 12:01 PM
ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు Sun, Jul 14, 2024, 11:22 AM
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM