'తంగలన్' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Tue, Jul 09, 2024, 03:02 PM

దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో విక్రమ్ 'తంగలన్' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాపై ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని జులై 10, 2024న విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి అధికారకంగా ప్రకటించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ మరియు పార్వతి తిరువోతు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో డేనియల్ కాల్టాగిరోన్, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Latest News
 
ఉస్తాద్ భగత్ సింగ్‌లో తొలిప్రేమ పాట రీక్రియేషన్! Mon, Mar 16, 2026, 03:41 PM
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కు మెగా స్టార్ చిరంజీవి ప్రశంసలు Sun, Mar 15, 2026, 02:42 PM
పాతాళ భైరవి సినిమాకు 75 ఏళ్లు పూర్తి Sun, Mar 15, 2026, 02:18 PM
ప్రముఖ బాలీవుడ్ నటి మధు మల్హోత్రా కన్నుమూత Sun, Mar 15, 2026, 02:17 PM
సుకుమార్-రామ్ చరణ్ సినిమా.. DSPకి బ్రేక్? Sun, Mar 15, 2026, 11:56 AM