డబ్బింగ్ దశకు చేరుకున్న 'దేవర'

by సూర్య | Mon, Jul 08, 2024, 05:26 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా దేవర డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్లు ఇటీవలి అప్‌డేట్‌లు వెల్లడిస్తున్నాయి. సినిమాలో సపోర్టింగ్ రోల్ పోషిస్తున్న హిమజ ఈ సినిమా కోసం తన డబ్బింగ్ సెషన్ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతిమరాఠే, తారక్ పొన్నప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
అజిత్‌పై యువ నటుడు చేసిన ట్వీట్ వైరల్ Sat, Oct 26, 2024, 04:18 PM
కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోషూట్ ! Sat, Oct 26, 2024, 04:17 PM
డైరెక్టర్ సుజీత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'OG' టీమ్ Sat, Oct 26, 2024, 04:12 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Oct 26, 2024, 04:06 PM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఐశ్వర్య రాజేష్ Sat, Oct 26, 2024, 03:59 PM