'దేవర' లో తన షూటింగ్ ని పూర్తి చేసుకున్న ప్రముఖ నటుడు

by సూర్య | Mon, Jul 08, 2024, 03:37 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న వంశి తన పార్ట్ షూటింగ్ ని పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతిమరాఠే, తారక్ పొన్నప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM