రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్

by సూర్య | Mon, Oct 28, 2024, 07:24 PM

తెలుగు టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్ జీబ్రా అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు ధనంజయ ప్రధాన పాత్రలో ఒకరు. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ సినిమా అక్టోబర్ 31న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లో విడుదల కానుంది కావలిసి ఉంది, కానీ కొన్ని కారణాల వాళ్ళ ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క విడుదల తేదీ అనౌన్స్మెంట్ రేపు ఉదయం 11:05 గంటలకి రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ మల్టీ స్టారర్‌కి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రియా భవానీ శంకర్ మరియు జెన్నిఫర్ పిక్కినాటో మహిళా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు సత్యరాజ్, సత్య ఆకల, సునీల్, ప్రియా భవాని శంకర్ ఇతరలు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సత్య పొన్మార్ సినిమాటోగ్రాఫర్ కాగా  మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటింగ్ చూసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. 

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM