1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'డార్లింగ్' ట్రైలర్

by సూర్య | Mon, Jul 08, 2024, 03:39 PM

అశ్విన్ రామ్ దర్శకత్వంలో  ప్రియదర్శి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి డార్లింగ్‌ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో వన్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌లో నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో అనన్య నాగళ్ల, మొయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, కళ్యాణి రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి శ్రీమతి చైతన్య సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులై 19న విడుదల కానుంది.

Latest News
 
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM
బిగ్ బాస్ తెలుగు S8లో 'క' టీమ్ Mon, Oct 28, 2024, 06:19 PM
సినిమాగా రానున్న మీర్జాపూర్ సిరీస్ Mon, Oct 28, 2024, 06:07 PM
వైజాగ్ వాసులతో 'కంగువ' చూడాలని తన కోరికను వ్యక్తం చేసిన సూర్య Mon, Oct 28, 2024, 06:01 PM
'రాబిన్‌హుడ్' టీజర్ విడుదల ఎప్పుడంటే..! Mon, Oct 28, 2024, 05:55 PM