ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశా ..హీరోయిన్ రాశి సంచలన కామెంట్స్

by సూర్య | Mon, Jul 08, 2024, 12:43 PM

అలనాటి స్టార్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాదాపు అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 100 చిత్రాలకు పైగా నటించి స్టార్‌డమ్ అందుకున్నారు. ఇక యువ నటీనటులు అప్పుడప్పుడే ఎంట్రీ ఇస్తుండడంతో ఈ అమ్మడుకు ఆఫర్లు తగ్గాయి. దీంతో మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే గిరిజ కళ్యాణం, జానకి కలగనలేదు అనే సీరియల్స్ చేశారు. స్టార్ మా లో ప్రసారమయ్యే జానకి కలగనలేదు సీరియల్‌లో హీరోకి మదర్ క్యారెక్టర్ చేసింది. అందులో తన నటనకు అందరూ మెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ భామ డైరెక్టర్ తేజ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


 


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి తన కెరీర్ ఇలా కావడానికి డైరెక్టర్ తేజనే అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. 'నిజం' మూవీలో నేను చేసిన క్యారెక్టర్ వల్ల నా జీవితం నాశనం అయ్యింది. ఈ మూవీలోని మల్లి క్యారెక్టర్ కారణంగా తాను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని.. ఇందులో గోపీచంద్‌తో పరిమితికి మించి రొమాంటిక్ సీన్లలో నటించడం కొంప ముంచిందని రాశి చెప్పారు. దర్శకుడు తేజ నిజం సినిమాలో తన పాత్ర గురించి చెప్పింది ఒకటి, చూపించింది మరొకటన్నారు. మొదటి నుంచి ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశానని.. షూటింగ్ మొదలైన తొలిరోజే స్పాట్‌ నుంచి వెళ్లిపోదామని అనుకున్నానని కానీ అడ్వాన్స్ తీసుకోవడం వల్ల నటించాల్సి వచ్చిందని రాశి వెల్లడించారు.నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌కు మంచి మార్కులే పడినా.. కొంతమంది అభిమానులు మాత్రం తనను అలాంటి సీన్స్‌లో చూసి ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలకు తాను దూరం కావాలి అనుకున్నానే తప్పించి, సినిమాలు తనని వద్దు అనుకోలేదని రాశి తెలిపారు. ప్రస్తుతం రాశి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


 


 

Latest News
 
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM
'విశ్వం' తాత్కాలిక OTT విడుదల తేదీ Wed, Oct 30, 2024, 05:53 PM
150కి పైగా ప్రీమియర్ షోలతో 'లక్కీ బాస్కర్' Wed, Oct 30, 2024, 05:47 PM
ప్రీమియర్ తేదీని లాక్ చేసిన నయనతార వివాహ డాక్యుమెంటరీ Wed, Oct 30, 2024, 05:42 PM