150కి పైగా ప్రీమియర్ షోలతో 'లక్కీ బాస్కర్'

by సూర్య | Wed, Oct 30, 2024, 05:47 PM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన రాబోయే చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'లక్కీ బాస్కర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా అక్టోబర్ 31న దీవాలి సందర్భంగా విడుదల కానుంది. ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ చిత్రం విశేషమైన బజ్‌ని సృష్టించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ రాత్రికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా 150కి పైగా పెయిడ్ ప్రీమియర్ షోలను ప్లాన్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. వాటిలో 50కి పైగా హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. ఇది సినిమా కంటెంట్‌పై నిర్మాతలకు ఉన్న గట్టి నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఈ బహుభాషా చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Latest News
 
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM
'విశ్వం' తాత్కాలిక OTT విడుదల తేదీ Wed, Oct 30, 2024, 05:53 PM
150కి పైగా ప్రీమియర్ షోలతో 'లక్కీ బాస్కర్' Wed, Oct 30, 2024, 05:47 PM
ప్రీమియర్ తేదీని లాక్ చేసిన నయనతార వివాహ డాక్యుమెంటరీ Wed, Oct 30, 2024, 05:42 PM