by సూర్య | Mon, Jul 08, 2024, 01:51 PM
డ్రగ్స్ టెస్ట్ రిపోర్టులో తనకు నెగటివ్ వచ్చిందని సినీ నటి హేమ తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడటంతో నటి హేమప్రాథమిక సభ్యత్వాన్ని 'మూవీ ఆర్టిస్టు అసోసియేషన్' రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ‘మా' అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి లేఖ అందించారు. షోకాజు నోటీసు ఇవ్వకుండా తనని మా సభ్యత్వం నుంచి తొలగించడం అన్యాయం అని వాపోయారు. మళ్లీ 'మా'లో తన సభ్యత్వాన్ని కొనసాగించాలని అభ్యర్థించారు.
Latest News