by సూర్య | Mon, Jul 08, 2024, 12:35 PM
నేచురల్ స్టార్ నాని దర్శకుడు ఎలా చెబితే అలా తనని తాను మార్చుకునే నటుడు. ఆ మార్పు కూడా చాలా సహజసిద్ధంగా ఉంటుంది. నాని రొమాంటిక్ మూవీ చేసినా, ఫ్యామిలీ డ్రామా చేసినా, దసరా లాంటి మాస్ చిత్రం చేసినా ఆయన పెర్ఫామెన్స్ నేచురల్ గా అనిపిస్తుంది. అందుకే టాలీవుడ్ కి నాని నేచురల్ స్టార్ అయ్యారు. టాలీవుడ్ లో లిప్ కిస్ ల గురించి ఎప్పుడు చర్చ జరిగినా సోషల్ మీడియాలో పెద్ద హంగామానే జరుగుతుంది. పక్కింటి అబ్బాయి లాగా అనిపించే నాని రొమాంటిక్ సీన్స్ చేసినప్పుడు ఆ చర్చ ఇంకా ఎక్కువవుతుంది. నాని గతంలో కొన్ని చిత్రాల్లో లిప్ లాక్ సీన్స్ లో నటించాడు.
నాని, కృతి శెట్టి జంటగా నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ కిస్సింగ్ సీన్ ఉంది. ఈ సన్నివేశంలో నటించే ముందు డైరెక్టర్ ని నాని చాలా ప్రశ్నలు అడిగారట. ఎందుకంటే ఏదో కావాలని లిప్ లీక్ సీన్ ఉండకూడదు. కథలో భాగంగా ఉండాలి అని చెప్పారట. ఆ సీన్ చేసేటప్పుడు నానికి మరో జన్మ గుర్తుకు వస్తుంది. కాబట్టి కథలో భాగమే. ఇక హీరోయిన్ కృతి శెట్టి విషయానికి వస్తే ఆమె షాకింగ్ కండిషన్ పెట్టిందట. లిప్ లాక్ సీన్ జరిగేటప్పుడు.. డైరెక్టర్ కెమెరా మెన్ తప్ప తన చుట్టూ ఇంకెవరూ ఉండకూడదు అని కండిషన్ పెట్టిందట.ఆమె ప్రైవసీని అర్థం చేసుకుని అలాగే చేశారు. హాయ్ నాన్న చిత్రంలో కూడా నాని, మృణాల్ మధ్య కిస్సింగ్ సీన్ ఉంది. ఓ ఇంటర్వ్యూలో మీ ప్రతి చిత్రంలో కిస్సింగ్ సీన్ ఉంటోంది. మీరే కావాలని డైరెక్టర్ ని అడిగి ఇలాంటి సీన్స్ రాయించుకుంటున్నారా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి నాని అదిరిపోయే సమాధానం ఇచ్చారు. దసరా చిత్రంలో కిస్ సీన్ లేదు, అంటే సుందరానికీ లో లేదు. మరి ఎందుకు అలా అడుగుతున్నారో అర్థం కావడం లేదు అని నాని అన్నారు. సినిమాకి హైప్ రావడం కోసం, టీజర్ లో పెడితే పబ్లిసిటీ వస్తుందని నేను రొమాంటిక్ సీన్స్ చేయడం ఎప్పుడైనా చూసారా అని నాని ప్రశ్నించారు. కథ డిమాండ్ చేస్తున్నప్పుడు దర్శకుడిని గౌరవించి ఇలాంటి సన్నివేశాలు చేస్తానని నాని క్లారిటీ ఇచ్చారు.
Latest News