by సూర్య | Sat, Jul 06, 2024, 04:51 PM
పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన పాన్-ఇండియా సినిమా 'స్కంద ది ఎటాకర్' యొక్క శాటిలైట్ రైట్స్ ని జీ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం జులై 6, 2024న =06:00 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించనుంది. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల జోడిగా నటిస్తుంది. సాయి మంజ్రేకర్, ప్రిన్స్ సెసిల్, గౌతమి, ఇంద్రజ, రాజా, శ్రీకాంత్, శరత్ లోహితాశ్వ, పృథ్వీరాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
Latest News