100M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'కళింగ'

by సూర్య | Thu, Oct 31, 2024, 07:21 PM

కిరోసిన్‌తో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు ధృవ వాయు తన కొత్త చిత్రం కళింగ కోసం దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ధృవ వాయు ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13, 2024న థియేటర్‌లలో విడుదల అయ్యి పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకొని థియేటర్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫారంస్ ప్రైమ్ వీడియో మరియు ఆహా సొంతం చేసుకున్నాయి. ఈ సినిమా డిజిటల్ ప్లాటుఫార్మ్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా 100M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసినట్లు డిజిటల్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ పిల్టఫార్మ్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రజ్ఞా నయన్ మహిళా ప్రధాన పాత్రను పోషిస్తుంది. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
సుమతో 'మట్కా' బృందం దివాళీ స్పెషల్ ఇంటర్వ్యూ అవుట్ Thu, Oct 31, 2024, 07:42 PM
'ఎల్2 ఎంపురాన్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Oct 31, 2024, 07:39 PM
బ్లడీ బెగ్గర్ నుండి బెగ్గర్ పీక్ రిలీజ్ Thu, Oct 31, 2024, 07:30 PM
నేడు మల్లికార్జున థియేటర్ ని విసిట్ చేయనున్న 'క' బృందం Thu, Oct 31, 2024, 07:26 PM
100M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'కళింగ' Thu, Oct 31, 2024, 07:21 PM