నార్త్ అమెరికాలో 'కల్కి 2898AD' సెన్సేషన్

by సూర్య | Sat, Jul 06, 2024, 04:53 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' చిత్రం జూన్ 27, 2024న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ అండ్ AAAక్ రియేషన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా నార్త్ అమెరికా ప్రీమియర్ గ్రాస్ $14.75M మార్క్ కి చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, అన్నా బెన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్, మాళవిక నాయర్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మించింది.

Latest News
 
సుమతో 'మట్కా' బృందం దివాళీ స్పెషల్ ఇంటర్వ్యూ అవుట్ Thu, Oct 31, 2024, 07:42 PM
'ఎల్2 ఎంపురాన్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Oct 31, 2024, 07:39 PM
బ్లడీ బెగ్గర్ నుండి బెగ్గర్ పీక్ రిలీజ్ Thu, Oct 31, 2024, 07:30 PM
నేడు మల్లికార్జున థియేటర్ ని విసిట్ చేయనున్న 'క' బృందం Thu, Oct 31, 2024, 07:26 PM
100M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'కళింగ' Thu, Oct 31, 2024, 07:21 PM