by సూర్య | Wed, Jun 26, 2024, 02:45 PM
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 14వ చిత్రాని పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'మట్కా' అని టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క మూడవ షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని విడుదల చేసారు. ఈ హై-బడ్జెట్ మూవీలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ముఖ్య పాత్రలో కనిపించనుంది. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ మరియు ఇతరులు ఈ సినిమా కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డా.విజేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు.
Latest News