by సూర్య | Wed, Jun 26, 2024, 02:43 PM
టాలీవుడ్ హీరో నవదీప్ అవనీంద్ర దర్శకత్వంలో నటించిన 'లవ్ మౌళి' సినిమా జూన్ 7, 2024న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా వీడియో సొంతం చేసుకుంది. ఈ సినిమా జూన్ 27, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నవదీప్ సరసన పంఖురి గిద్వాన్ నటిస్తోంది. ఈ చిత్రానికి 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందించారు. ఈ సినిమాని సిస్పేస్, నైరా క్రియేషన్స్ మరియు శ్రీకరా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ మరియు ఇతరులుకీలక పాత్రలు పోషిస్తున్నారు.