'కల్కి 2898 AD' నుండి పశుపతి ఫస్ట్ లుక్ అవుట్

by సూర్య | Sat, Jun 22, 2024, 04:48 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా జూన్ 27, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో వీరన్ పాత్రలో నటిస్తున్న సీనియర్ నటుడు పశుపతి ఫస్ట్ లుక్‌ని మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేశారు. పశుపతి తమిళ చిత్ర పరిశ్రమలో బహుముఖ మరియు ప్రభావవంతమైన పాత్రలకు ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా సర్పత్త పరంబరైలో అతని అద్భుతమైన నటనకు విస్తృతమైన ప్రశంసలు లభించాయి. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, అన్నా బెన్ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM
'విశ్వం' తాత్కాలిక OTT విడుదల తేదీ Wed, Oct 30, 2024, 05:53 PM
150కి పైగా ప్రీమియర్ షోలతో 'లక్కీ బాస్కర్' Wed, Oct 30, 2024, 05:47 PM
ప్రీమియర్ తేదీని లాక్ చేసిన నయనతార వివాహ డాక్యుమెంటరీ Wed, Oct 30, 2024, 05:42 PM