'దేవర' అనంతపూర్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Mon, Jun 17, 2024, 07:12 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క అనంతపూర్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ LLP సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతిమరాఠే, తారక్ పొన్నప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM