'లక్కీ బాస్కర్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Mon, Jun 17, 2024, 07:09 PM

టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి తన తదుపరి చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ తో చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ యొక్క మూడవ స్ట్రెయిట్ తెలుగు సినిమా అయ్యిన ఈ సినిమా పై సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి లక్కీ బాస్కర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా సెప్టెంబర్ 27, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని జూన్ 19, 2024న విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌ సరసన జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
పవన్ సినిమా రిలీజ్‌ను భారీగా నిర్వహించాలనే ప్లాన్.. Wed, May 21, 2025, 05:08 PM
భైరవం: వైరల్ అవుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ వాఖ్యలు Wed, May 21, 2025, 05:00 PM
'లెనిన్' క్లైమాక్స్ షూట్ అప్పుడేనా...! Wed, May 21, 2025, 04:53 PM
'హ్రిదయాపూర్వం' ఫస్ట్ లుక్ రిలీజ్ Wed, May 21, 2025, 04:44 PM
జూన్ 13న రానున్న ‘రానా నాయుడు2’ Wed, May 21, 2025, 04:42 PM