ప్రసన్న కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'SK30' టీమ్

by సూర్య | Mon, Jun 17, 2024, 06:58 PM

తెలుగు నటుడు సందీప్ కిషన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'SK30' అనే టైటిల్ ని పెట్టారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా రైటర్ ప్రసన్న కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. రావు రమేష్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్ట్‌కి కథ, స్క్రీన్‌ప్లే మరియు సంభాషణలకు ప్రముఖ రచయిత ప్రసన్న కుమార్ బాధ్యత వహిస్తున్నారు. హాస్య మూవీస్‌, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

Latest News
 
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM
జెమినీ టీవీలో రేపటి సినిమాలు Sat, Jul 13, 2024, 05:38 PM
'శివం భజే' రిలీజ్ డేట్ ఖరారు Sat, Jul 13, 2024, 05:37 PM
క్రియేటివ్ ప్రొడ్యూసర్ సీతారామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'డార్లింగ్' టీమ్ Sat, Jul 13, 2024, 05:36 PM