by సూర్య | Fri, Jun 14, 2024, 03:39 PM
రాజ్‌కుమార్ రావ్ మరియు శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలలో నటించిన స్త్రీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి మరియు అభిషేక్ బెనర్జీ ఇతరలు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ భేదియాగా కనిపించనున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో చిత్ర బృందం అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనుంది. ఈ హర్రర్ చిత్రాన్ని దినేష్ విజన్ మరియు జియో స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.
Latest News