'విశ్వంభర' ఆన్ బోర్డులో కునాల్ కపూర్

by సూర్య | Fri, Jun 14, 2024, 03:41 PM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ దర్శకుడు వస్సిష్ట మల్లిడితో కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కునాల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో సురభి, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, ఆషిక రంగనాథ్ మరియు అశ్రిత వేముగంటి నండూరి కీలక పాత్రలలో కనిపించనున్నారు. రచయిత-నటుడు నుండి దర్శకుడిగా మారిన హర్ష వర్ధన్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఫాంటసీ డ్రామా జనవరి 10, 2025న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది. ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి సౌండ్‌ట్రాక్‌ను స్కోర్ చేస్తున్నారు.

Latest News
 
సుమతో 'మట్కా' బృందం దివాళీ స్పెషల్ ఇంటర్వ్యూ అవుట్ Thu, Oct 31, 2024, 07:42 PM
'ఎల్2 ఎంపురాన్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Oct 31, 2024, 07:39 PM
బ్లడీ బెగ్గర్ నుండి బెగ్గర్ పీక్ రిలీజ్ Thu, Oct 31, 2024, 07:30 PM
నేడు మల్లికార్జున థియేటర్ ని విసిట్ చేయనున్న 'క' బృందం Thu, Oct 31, 2024, 07:26 PM
100M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'కళింగ' Thu, Oct 31, 2024, 07:21 PM