`స్పై` ఫెయిల్యూర్‌పై ఐశ్వర్య మీనన్‌ రియాక్షన్‌

by సూర్య | Wed, May 29, 2024, 11:11 AM

ఐశ్వర్య మీనన్‌ `స్పై` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ డిజప్పాయింట్‌ చేసింది. ఇప్పుడు `భజే వాయు వేగం` చిత్రంలో నటిస్తుంది. తాజాగా `స్పై` ఫెయిల్యూర్‌పై ఆమె రియాక్ట్ అయ్యింది. `స్పై` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్‌. ఇందులో గ్లామర్‌గానే కాదు యాక్షన్‌తోనూ మెప్పించింది. ట్విస్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసింది. కానీ సినిమా తేడా కొట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫెయిల్యూర్‌పై స్పందించింది ఐశ్వర్య. సినిమా బాగుందనే చేశామని, కానీ ఫలితం మన చేతుల్లో ఉండదని చెప్పింది. `ప్రతి సినిమాను ఇష్టపడే చేస్తాం. కానీ ఫలితం మన చేతుల్లో ఉండదు. నా సినిమాలన్నీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటా. కానీ ఆ ఫలితం ఇచ్చేది ప్రేక్షకులు. వాళ్లకు మూవీ నచ్చాలి. వాళ్లు ఆదరించాలి. అప్పుడే విజయం దక్కుతుంది. `స్పై` సినిమా విషయంలో నేను అనుకునేది ఇదే. ఆ సినిమా కోసం టీమ్ అంతా శ్రమించారు. కానీ రిజల్ట్ అనుకున్నట్లు రాలేదు` అని తెలిపింది ఐశ్వర్య మీనన్.  ఐశ్వర్య మీనన్‌ తెలుగులో మరో సినిమాతో రాబోతుంది. కార్తికేయతో కలిసి `భజే వాయు వేగం` చిత్రంలో నటించింది. ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ నెల 31న సినిమా రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో సోమవారం ఐశ్వర్య మీనన్‌ మీడియాతో ముచ్చటించింది. ఇందులో ఆమె మాట్లాడుతూ ``భజే వాయు వేగం` సినిమాలో ఇందు అనే క్యారెక్టర్ చేశాను. ఆమె బ్యూటీషియన్. బ్యూటీషియన్ అంటే సహజంగానే అందంగా ఉంటుంది. ఈ సినిమాలో హీరో పేరు వెంకట్. ఆయన పర్సెప్షన్ లోనే సినిమా అంతా వెళ్తుంది. కథలో నేను కీలకమైన పాత్రగా ఉంటాను. ఇది కమర్షియల్ సినిమా అయినా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అలా వచ్చి ఇలా వెళ్లినట్లు నా క్యారెక్టర్ ఉండదు.  వెంకట్ కోసం ఈ అమ్మాయి ఏదైనా చేస్తుంది. అంతగా అతన్ని ఇష్టపడుతుంది. `భజే వాయు వేగం` ఒక రా కంటెంట్ మూవీ. యాక్షన్, ఎమోషన్ ఆకట్టుకుంటాయి. నాకు ఇలాంటి సబ్జెక్ట్స్ చేయడం ఇష్టం పైగా యూవీ లాంటి పెద్ద బ్యానర్ నిర్మించింది. సో ఆఫర్ వచ్చిన వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నా. ఈ సినిమాలో ట్రెడిషనల్ క్యారెక్టర్ లో కనిపిస్తా. సినిమా చీరకట్టు లేదా  ట్రెడిషనల్ దుస్తులు వేసుకుంటా. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం ఇష్టం ఎందుకంటే రియల్ లైఫ్ లో కూడా నాకు ట్రెడిషనల్ దుస్తులు ధరించేందుకు ఇష్టపడుతుంటా. 


 


`భజే వాయు వేగం` సినిమాలో యాక్షన్, ఎమోషన్ తో పాటు లవ్, రొమాన్స్ కూడా ఉంటుంది. అయితే లవ్ రొమాన్స్ పార్ట్ తక్కువగానే ఉంటుంది.  డబ్బు నేపథ్యంగా కథ ఉంటుందా అనేది తెరపైనే చూడాలి. ఆ ట్విస్టులు ఆకట్టుకునేలా ఉంటాయి. కార్తికేయతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఆయన నటించిన `ఆర్ఎక్స్ 100` సినిమా చూశాను. కార్తికేయతో సినిమా చేయాలని ఉండేది. అతను అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు` అని చెప్పింది ఐశ్వర్య.


ఇక తన బ్యాక్‌ గ్రౌండ్, సినిమాల్లోకి రావడం గురించి చెబుతూ, `తమిళనాడులో ఈరోడ్ అనే చిన్న టౌన్ మాది. మధ్య తరగతి కుటుంబం. మా బ్రదర్ డాక్టర్. నేను ఇంజినీరింగ్ చేశా. స్కూల్ లో చదువుకుంటున్న టైమ్ లోనే నేను బాగా పాపులర్. కమర్షియల్ యాడ్స్ లో నటించడం, స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడంతో బాగా పేరొచ్చింది. ఇంజినీరింగ్ పూర్తయ్యాక పూర్తిగా నటన మీద ఫోకస్ చేశాను. నేను పరిశ్రమలో తెచ్చుకున్న గుర్తింపునకు గర్వంగా ఉంది. ఇదంతా నాకు నేనుగా సొంతంగా తెచ్చుకున్న పేరు. ప్రేక్షకుల అభిమానం పొందడం అనేది ఏ ఆర్టిస్టుకైనా ముఖ్యం. ఆఫర్స్, సక్సెస్ తర్వాత ముందు ప్రేక్షకుల యాక్సెప్టెన్సీ ఉంటే ఇక్కడ కెరీర్ బాగుంటుంది. ఆ ఆదరణ పొందడం కోసం ప్రయత్నిస్తున్నా` అని వెల్లడించింది ఐశ్వర్య మీనన్.

Latest News
 
మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రితీష్ రానా...? Wed, Sep 18, 2024, 11:31 PM
ఇంస్టాగ్రామ్ లో 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Wed, Sep 18, 2024, 09:05 PM
'తంగలన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Sep 18, 2024, 09:03 PM
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM