కళ్యాణ్ రామ్ నూతన చిత్రం గ్లింప్స్‌ విడుదల

by సూర్య | Tue, May 28, 2024, 08:24 PM

నందమూరి తారక రామారావు జయంతి  సందర్భంగా.. దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో చేస్తున్న తన 21 వ చిత్రం గ్లింప్స్‌ని నందమూరి కళ్యాణ్ రామ్  విడుదల చేశారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’ పేరుతో వదిలిన గ్లింప్స్.. కళ్యాణ్ రామ్‌ని యాక్షన్-ప్యాక్డ్ గా సరికొత్త గెటప్‌లో ప్రజెంట్ చేసింది. ‘ది ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’ వీడియోలో నందమూరి కళ్యాణ్ రామ్ తన పిడికిలిని చూపించడం తన క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా వుంటుందో తెలియజేస్తోంది. వీడియోలో మాస్ అవతార్‌లో కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నారు. ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ విజువల్స్ గ్రాండ్‌గా వున్నాయి. ఈ గ్లింప్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ వీడియోని నందమూరి అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. 

Latest News
 
టాలీవుడ్ నాకు ప్రత్యేకం: పూజా హెగ్డే Tue, Jun 18, 2024, 12:25 PM
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM
హీరో దర్శన్ కేసుపై స్పందించిన నటుడు Tue, Jun 18, 2024, 10:47 AM
USAలో $200K మార్క్ ని చేరుకున్న 'మహారాజా' Mon, Jun 17, 2024, 10:28 PM