చిన్నారికి అండగా నిలిచిన రామ్ చరణ్, వీడియో వైరల్

by సూర్య | Thu, Oct 17, 2024, 11:42 PM

మెగాస్టార్‌ చిరంజీవి నటనలోనే కాదు, సాయం చేయడంలోనూ, సేవా కార్యక్రమాల్లో ముందుండే మంచి మనిషి. అందుకే ఆయన్ను అన్నయ్య అని, ఆపద్బాంధవుడు అని  అభిమానులు పిలుచుకుంటారు. ఆయన దార్లోనే తనయుడు గ్లోబల్‌స్టార్‌ కూడా నడుచుకుంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. గుప్త ధానాలు చేస్తుంటారు. చదువుకోవాలనే తపన ఉండి.. చదువుకోలేని వారికి చదువు చెప్పిస్తుంటారు. అయితే ఇవన్నీ పెద్దగా బయటకు తెలియని విషయాలు. రామ్‌ చరణ్‌ చేసిన ఓ సాయం గురించి ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 


తాజాగా ఆయన ఓ చిన్నారికి  ప్రాణదాతగా నిలిచారు రామ్‌చరణ్‌. అసలు విషయంలోకి వెళ్తే.. ఆగస్టు 22న మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. మెగా అభిమానులకు ఆ రోజు ఓ పండగ లాంటిది. అదే రోజు ఒక ఫోటో జర్నలిస్టు కుటుంబంలో పాప జన్మించింది. కానీ ఆ పాపకి గుండె సంబంధిత పల్మనరీ హైపర్‌ టెన్షన్‌ అనే సమస్య ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా పాప బతికే అవకాశం చాలా తక్కువ ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో చికిత్స కోసం ఆ పాపని అపోలో ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ఈ చికిత్సకి లక్షలు ఖర్చు అవుతుందనే విషయం తెలిసింది. కానీ సదరు జర్నలిస్టుకి అంత భారీ బడ్జెట్‌తో కూతురికి చికిత్స చేసే ఆర్థిక స్థోమత లేదు. ఇదే విషయం  రామ్‌ చరణ్‌ దృష్టికి వెళ్ళింది. పాప ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న చరణ్‌ ఆ చిన్నారికి చికిత్స అందించే బాధ్యతను తీసుకున్నారు. ఆగస్టు 24న ఆ పాపను హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. ఆ రోజు నుంచీ డిశ్చార్జ్‌ అయ్యేదాకా ఎప్పటికప్పుడు ఈ చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ కావాల్సిన సాయం అందిస్తూ వచ్చారు. పాపకు అవసరమైన బ్లడ్‌, ప్లేట్లెట్స్‌ వంటివి చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి అందించారు. ఎట్టకేలకు 53 రోజుల తర్వాత అంటే అక్టోబర్‌ 16న ఆ చిన్నారి పూర్తిగా కోలుకుంది.

Latest News
 
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM
‘రివాల్వర్ రీటా’ టీజర్ విడుదల Thu, Oct 17, 2024, 11:45 PM
మిస్ ఇండియా 2024 విన్నర్ నిఖిత పోర్వాల్‌ Thu, Oct 17, 2024, 11:43 PM
చిన్నారికి అండగా నిలిచిన రామ్ చరణ్, వీడియో వైరల్ Thu, Oct 17, 2024, 11:42 PM