by సూర్య | Tue, May 28, 2024, 08:25 PM
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన కొత్త సినిమా భజే వాయు వేగం. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న భజే వాయు వేగం సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మేందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో దర్శకుడు తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
Latest News