'ఓజీ' గురించి తాజా అప్‌డేట్‌

by సూర్య | Tue, May 28, 2024, 08:23 PM

'ఓజీ'  చిత్రం గురించి ఏ అప్‌డేట్‌ వచ్చినా పవన్ కల్యాణ్‌  అభిమానులకు పూనకాలే. ఇక అలాంటి అప్‌డేట్‌ రానే వస్తే.. ఈ చిత్రంలో గురించి ఒక ఇంటర్వ్యూలో చాలా చెప్పుకొచ్చారు దర్శకుడు సుజీత్. అసలు ఓజి షూటింగ్‌ ముచ్చట్లేంటి..? సినిమా ఎప్పుడు వస్తుంది..? ట్రైలర్‌ కట్‌ చేసారా..? లేదా ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారు దర్శకుడు. ప్రస్తుతం నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉన్నారు కానీ అందరి ఫోకస్‌ ఓజీ పైనే ఉంది. ఎందుకంటే అందులో పవన్ లుక్‌, టీజర్‌ అంతగా అంచనాలు పెంచాయి. అయితే చాలా రోజులు తర్వాత  పవన్  కల్యాణ్‌ చేస్తున్న ఒరిజినల్‌ సినిమా ఇది. టీజర్‌ రిలీజ్‌ నుంచే దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్‌ 70 శాతం పూర్తైంది. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఇంకా సెట్స్‌పైనే ఉంది 'ఓజి'. రెండు వారాలు  పవన్  డేట్స్‌ ఇస్తే చాలు ఈ సినిమా పూర్తైపోతుంది. ఓజిపై ఒక్క అప్‌డేట్‌ వస్తే చాలు అనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్‌ పెట్టారు సుజీత్‌. టైటిల్‌లోనే జపనీస్‌ లింక్‌ చూపించారు సుజీత్‌. ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఓజిలో జపనీస్‌ రిఫరెన్సులు ఉంటాయని కొన్ని యాక్షన సీన్స్   పవన్  స్వయంగా దగ్గరుండి డిజైన్‌ చేసారని తెలిపారు. ట్రైలర్‌ ఇప్పటికే కట్‌ చేసామని.. రిలీజ్‌కు ముందు విడుదల చేసామని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్‌ 27న ఈ చిత్రం విడుదల కానుంది.

Latest News
 
రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా Tue, Jun 18, 2024, 02:20 PM
ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు: విజయ్ Tue, Jun 18, 2024, 02:01 PM
టాలీవుడ్ నాకు ప్రత్యేకం: పూజా హెగ్డే Tue, Jun 18, 2024, 12:25 PM
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM