వరల్డ్ వైడ్ గా 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'టర్బో'

by సూర్య | Tue, May 28, 2024, 06:13 PM

వైశాఖ్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'టర్బో' చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్క్రీన్‌లలోకి వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 52.11 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో సునీల్, అంజనా జయప్రకాష్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్, బిందు పనికర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు రాజ్ బి శెట్టి విలన్‌గా నటిస్తున్నారు. మమ్ముట్టి హోమ్ బ్యానర్, మమ్ముట్టి కంపానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జస్టిన్ వర్గీస్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Latest News
 
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM
ఆయనతో వర్క్ చేయటం డ్రీమ్ కమ్ ట్రు అనిపించింది : మంజు వారియర్ Sat, Sep 21, 2024, 07:55 PM
'35-చిన్న కథ కాదు' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Sat, Sep 21, 2024, 07:32 PM
ఈ తేదీన ఓపెన్ కానున్న 'దేవర' అడ్వాన్స్ బుకింగ్స్ Sat, Sep 21, 2024, 07:27 PM