ఈ తేదీన ఓపెన్ కానున్న 'దేవర' అడ్వాన్స్ బుకింగ్స్

by సూర్య | Sat, Sep 21, 2024, 07:27 PM

శివ కోరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'దేవర' అనే టైటిల్ ని లాక్ చేసారు. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో "దేవర: పార్ట్ 1" ఒకటి. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సాంగ్స్ మరియు ట్రైలర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం, టిక్కెట్ ధర పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ఆమోదం పెండింగ్‌లో ఉన్నందున బుకింగ్‌లు సోమవారం తెరవబడతాయి అని సమాచారం. అధికారిక ధృవీకరణ రావలిసిఉంది.ర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM