రేపు విడుదల కానున్న 'పుష్ప 2' లోని సూసేకి సాంగ్

by సూర్య | Tue, May 28, 2024, 03:02 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని సూసేకి అనే టైటిల్ తో మే 29న 11.07 గంటలకు పూర్తి పాటని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మెలోడీ క్వీన్ శ్రేయాఘోషల్ 6 భాషల్లో ఈ సాంగ్ ని పాడారు. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Latest News
 
నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో 'మజాకా' ఫస్ట్ లుక్ Mon, Sep 23, 2024, 04:48 PM
క్రైమ్ థ్రిల్లర్‌లో విలన్‌గా మమ్ముట్టి Mon, Sep 23, 2024, 04:43 PM
100 కోట్ల మార్క్ దిశగా 'ARM' Mon, Sep 23, 2024, 04:36 PM
'ది గోట్' నుండి మట్ట వీడియో సాంగ్ రిలీజ్ Mon, Sep 23, 2024, 04:33 PM
ఇంస్టాగ్రామ్ లో 300K+ రీల్స్ ని నమోదు చేసిన 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ Mon, Sep 23, 2024, 04:26 PM