త్వరలో ప్రైమ్ లో అందుబాటులోకి రానున్న 'ఆవేశం' తెలుగు వెర్షన్

by సూర్య | Tue, May 28, 2024, 03:00 PM

మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ నటించిన 'ఆవేశం' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఘనత సాధించిన 7వ మాలీవుడ్ చిత్రంగా నిలిచింది. జిత్తు మాధవన్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా మే 9, 2024న మలయాళంలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ త్వరలో ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ నిర్మించిన ఈ చిత్రంలో హిప్‌స్టర్, రోషన్ షానవాస్, మిథున్ జై శంకర్, సజిన్ గోపు మరియు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సుశీన్ శ్యామ్ సౌండ్‌ట్రాక్ అందించారు.

Latest News
 
'వెట్టయన్' ట్రైలర్ విడుదలకి తేదీ ఖరారు Mon, Sep 23, 2024, 06:56 PM
'సత్యం సుందరం' ట్రైలర్ రిలీజ్ Mon, Sep 23, 2024, 06:51 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్ Mon, Sep 23, 2024, 06:46 PM
'మత్తు వదలారా 2' నుండి మొరాన్ సాంగ్ అవుట్ Mon, Sep 23, 2024, 05:30 PM
VD12: మేజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్ Mon, Sep 23, 2024, 05:24 PM