'లవ్ మి – ఇఫ్ యు డేర్' వరల్డ్ వైడ్ 3 రోజుల గ్రాస్ ఎంతంటే...!

by సూర్య | Tue, May 28, 2024, 02:58 PM

అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి నటించిన లవ్ మి – ఇఫ్ యు డేర్ సినిమా మే 25, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, హారర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా విడుదలైన 3 రోజులలో వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 9.03 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. వైష్ణవి చైతన్య ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన నటించింది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM