100 కోట్ల మార్క్ దిశగా 'ARM'

by సూర్య | Mon, Sep 23, 2024, 04:36 PM

జితిన్ లాల్ దర్శకత్వంలో మలయాళ నటుడు టోవినో థామస్ నటించిన అజయంతే రాండమ్ మోషణం (ARM) చిత్రం సెప్టెంబర్ 12, 2024న గ్రాండ్ గా విడుదల అయ్యింది. టోవినో థామస్ యొక్క 50వ చిత్రంగా ఉన్న ఈ సినిమా ఒక ఎపిక్ ఫాంటసీ సాగా. ఈ పాన్-ఇండియా చిత్రం పూర్తిగా 3Dలో రూపొందించబడింది మరియు మలయాళ సినిమా చరిత్రలో అత్యంత సాంకేతికంగా గొప్ప చిత్రాలలో ఒకటిగా ఉంది. మలయాళం, హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలతో పాటు స్పానిష్‌లో కూడా విడుదల కానుంది. అదనంగా, మలయాళం వెర్షన్ 30 భారతీయ మరియు విదేశీ భాషలలో ఉపశీర్షికలతో విడుదల అయ్యింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 87 కోట్ల గ్రాస్ ని వాసులు చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి మరియు కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్, జగదీష్, హరీష్ ఉత్తమన్, హరీష్ పెరడి, ప్రమోద్ శెట్టి మరియు రోహిణి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాని తెలుగులో ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP విడుదల చేసింది. ఈ చిత్రానికి దిభు నినాన్ థామస్ సంగీతం అందించగా, జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ మరియు UGM ప్రొడక్షన్స్‌పై డా. జకరియా థామస్ మరియు లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ చిత్రానికి సుజిత్ నంబియార్ కథను అందించారు.

Latest News
 
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగల్ Mon, Sep 23, 2024, 06:46 PM
'మత్తు వదలారా 2' నుండి మొరాన్ సాంగ్ అవుట్ Mon, Sep 23, 2024, 05:30 PM
VD12: మేజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్ Mon, Sep 23, 2024, 05:24 PM
గుజరాత్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఎల్2 ఎంపురాన్ Mon, Sep 23, 2024, 05:20 PM
10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'దేవర' రిలీజ్ ట్రైలర్ Mon, Sep 23, 2024, 05:16 PM