'పుష్ప '2 నుండి రావు రమేష్ క్యారెక్టర్ పోస్టర్ విడుదల

by సూర్య | Sat, May 25, 2024, 02:57 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రావు రమేష్ క్యారెక్టర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సీనియర్ నటుడు ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ నుండి అతని క్యారెక్టర్ పోస్టర్ ని ఈ ప్రత్యేక సందర్భంలో విడుదల చేసారు. ఈ యాక్షన్ డ్రామాలో పవర్ ఫుల్ పొలిటీషియన్ సిద్దప్పగా రావు రమేష్ నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Latest News
 
మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించిన 'మట్కా' Sat, Oct 12, 2024, 08:31 PM
విడుదల తేదీని ఖరారు చేసిన 'బ్రహ్మ ఆనందం' Sat, Oct 12, 2024, 08:26 PM
శ్రీకాంత్ ఒదెలాతో నాని పాన్ ఇండియా ఫిల్మ్ ప్రారంభం Sat, Oct 12, 2024, 08:24 PM
'NBK 109' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Sat, Oct 12, 2024, 08:19 PM
సంక్రాంతి ట్రాక్ లో 'గేమ్ ఛేంజర్' Sat, Oct 12, 2024, 08:13 PM