రాయన్ నుండి 'పీచు మిఠాయ్యి' సాంగ్ రిలీజ్

by సూర్య | Sat, May 25, 2024, 02:55 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి రాయన్ అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ని పీచు మిఠాయ్యి అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ సాంగ్ లో సందీప్ కిషన్ మరియు అపర్ణ బాలమురళి కనిపించనున్నారు. ఈ చిత్రం జూన్ 13న విడుదల కానుంది. ఈ సినిమాలో విష్ణు విశాల్, దుషార విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి మరియు SJ సూర్య కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ధనుష్ పవర్ ఫుల్ క్యామియోలో కనిపించనున్నాడు. నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
'లక్కీ బాస్కర్' 11 రోజుల వరల్డ్‌వైడ్ గ్రాస్ ఎంతంటే...! Mon, Nov 11, 2024, 05:41 PM
'క' టీమ్ ని ప్రశంసించిన మెగా స్టార్ Mon, Nov 11, 2024, 05:38 PM
'SDT 18' ఆన్ బోర్డులో అనన్య నాగళ్ల Mon, Nov 11, 2024, 05:34 PM
50M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'జనక ఐతే గనక' Mon, Nov 11, 2024, 05:31 PM
అన్‌స్టాపబుల్ విత్ NBK: ఈ తేదీన ప్రీమియర్ కానున్న అల్లు అర్జున్ ఐకానిక్ ఎపిసోడ్ Mon, Nov 11, 2024, 05:24 PM