విడుదల తేదీని లాక్ చేసిన 'మ్యూజిక్ షాప్ మూర్తి'

by సూర్య | Sat, May 25, 2024, 03:01 PM

ప్రభావవంతమైన పాత్రలకు పేరుగాంచిన తెలుగు నటుడు అజయ్ ఘోష్ రాబోయే చిత్రం 'మ్యూజిక్ షాప్ మూర్తి' లో ఒక ప్రత్యేకమైన పాత్రను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. విలన్ మరియు కామెడీ పాత్ర లలో ప్రేక్షకులని అలరించిన నటుడు ఇప్పుడు ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. శివ పాలడుగు దర్శకత్వంలో హర్ష గారపాటి నిర్మిస్తున్న మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఉత్సుకతను రేకెత్తించాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాని జూన్ 14,2 024న విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకి పవన్ సంగీతం, శ్రీనివాస్ బెజుగం లెన్స్‌మెన్‌గా, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
బాలీవుడ్ ని షేక్ చేస్తున్న కన్నడ భామలు Tue, Feb 18, 2025, 11:38 AM
రాంప్రసాద్ ప్రధాన పాత్రలో 'W/O అనిర్వేష్' Tue, Feb 18, 2025, 11:31 AM
ఈ నెల 26న విడుదల కానున్న 'మజాకా' Tue, Feb 18, 2025, 11:28 AM
వెంకీ అట్లూరి సినిమాలో భాగ్యశ్రీ బోర్సే Tue, Feb 18, 2025, 11:26 AM
ఈ నెల 21న విడుదల కానున్న ‘రామం రాఘవం’ Tue, Feb 18, 2025, 11:23 AM