'బ్రహ్మయుగం' OST విడుదలకి టైమ్ లాక్

by సూర్య | Fri, May 24, 2024, 07:00 PM

రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన బ్రహ్మయుగం చిత్రం ఫిబ్రవరి 15, 2024న విడుదల అయ్యింది. హారర్-థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ పాన్-ఇండియన్ చిత్రం ఎపిక్ ఫార్మాట్‌లో కూడా అందుబాటులో ఉంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క OSTని మూవీ మేకర్స్ రేపు ఉదయం 11 గంటలకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో అర్జున్ అశోక్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ ఎల్ పి, వై నాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మిస్తున్నారు.

Latest News
 
ఆఫీసియల్ : విడుదల తేదీని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Mon, Jul 22, 2024, 05:27 PM
ప్రభాస్ తదుపరి చిత్రంలో పాకిస్థానీ బ్యూటీ Mon, Jul 22, 2024, 05:22 PM
1 సంవత్సరం పూర్తి చేసుకున్న 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' Mon, Jul 22, 2024, 05:19 PM
YT మ్యూజిక్ ట్రేండింగ్ లో 'డబుల్ ఇస్మార్ట్' సెకండ్ సింగల్ Mon, Jul 22, 2024, 05:12 PM
ప్రైమ్ లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' ఇతర వెర్షన్స్ Mon, Jul 22, 2024, 05:09 PM