విజయ్ 'ది గోట్' సెట్స్ నుండి పిక్ రిలీజ్

by సూర్య | Fri, May 24, 2024, 06:58 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ సినిమాకి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T.) అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2024న గ్రాండ్ విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా సెట్స్ నుండి మూవీ మేకర్స్ ఒక పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ సినిమాలో విజయ్ సరసన హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కలాపతి, కళపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కళపతి ఎస్ సురేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.

Latest News
 
అనాథాశ్రమంలో పెరిగి.. పానీపూరితో ఆకలి తీర్చుకున్న హీరోయిన్ Fri, Apr 17, 2026, 02:36 PM
బాలయ్య సినిమాలో విలన్‍గా ఎస్.జె.సూర్య! Fri, Apr 17, 2026, 02:32 PM
తప్పుడు రైలు దిగిపోవడమే మేలు: హన్సిక Fri, Apr 17, 2026, 02:22 PM
బాలకృష్ణ, డింపుల్ హయాతి హెలికాప్టర్ ప్రయాణం వైరల్ Fri, Apr 17, 2026, 02:00 PM
జూన్‍లో వరుణ్ సందేశ్ 'క్యాస్ట్' మూవీ విడుదల Fri, Apr 17, 2026, 12:40 PM