'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీమ్ తో సుమ ఫుల్ ఇంటర్వ్యూ వీడియో విడుదల

by సూర్య | Thu, May 23, 2024, 07:40 PM

కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన తదుపరి చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా మూవీ టీమ్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా సుమతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఫుల్ ఇంటర్వ్యూని మూవీ మేకర్స్ యూట్యూబ్ లో విడుదల చేసారు. ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 31, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM
‘రివాల్వర్ రీటా’ టీజర్ విడుదల Thu, Oct 17, 2024, 11:45 PM
మిస్ ఇండియా 2024 విన్నర్ నిఖిత పోర్వాల్‌ Thu, Oct 17, 2024, 11:43 PM
చిన్నారికి అండగా నిలిచిన రామ్ చరణ్, వీడియో వైరల్ Thu, Oct 17, 2024, 11:42 PM